Skip to main content

Telugu News Power

మంత్రి నిమ్మల కృషి తో గోరింటాడ తాగునీటి పథకం. పరుగులు పెడుతున్న రూ.5.35 కోట్ల పనులు.

గోరింటాడ రక్షిత మంచినీటి పధకం పనులు.

పాలకొల్లు: ఆగస్టు,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన మొదటి ప్రాధాన్యత గా, ప్రత్యేక లక్ష్యం తో పనులు వేగం పుంజుకోవడానికి కృషి చేస్తున్నారు. “అమరజీవి సుజల ధార” పథకం ద్వారా అవసరమైన నిధులు ఈ పనులకు మంజూరు చేయించారు. ప్రతి గ్రామానికి రక్షిత గోదావరి జలాలను అందించే దిశగా పనులను పరుగులు పెట్టిస్తున్నారు. గోరింటాడకు రూ.5.35 కోట్ల అంచనా వ్యయంతో పనులు సాగుతున్నాయి.
రక్షిత మంచినీటి పనుల్లో ప్రధానమైన 40 వేల లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మాణం జరుగుతున్నది. ఓవర్‌హెడ్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(ఓ హెచ్ బి ఆర్)120 అడుగుల ఎత్తులో నిర్మిస్తారు. ఈ రిజర్వాయర్ పరిధిలో ఉన్న గ్రామాలకు ఒక రోజుకు అవసరమైన నీటినిల్వ సామర్థ్యంతో ఈ పై ట్యాంకు నిర్మాణం జరుగుతున్నది. సంపు, పంప్‌హౌస్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ తదితర మౌలిక వసతుల నిర్మాణ పనులూ సమాంతరంగా జరుగుతున్నాయి.
నాగరాజుపేట, బూస్టర్‌ స్టేషన్‌ ద్వారా గోదావరి జలాలు గోరింటాడకు తరలిస్తారు. అక్కడి నుంచి పరిసర గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా జరుగుతుంది. చందపర్రు, ఆగరు, అగర్తిపాలెం, వెలివెల, ఎస్‌.చిక్కాల, తిల్లపూడి, సగం చెరువు, మల్లవరం, మల్లవరం లంక, సరిపల్లి, కొప్పర్రు, చిన్నమామిడిపల్లి తదితర గ్రామాలకు ఈ పథకం ద్వారా రక్షిత తాగునీరు పంపిణీ చేస్తారు.
కలుషిత నీటి సమస్యకు ఈ గ్రామాలకు శాశ్వత విముక్తి లభిస్తుంది. పడుతున్న తాగునీటి ఇబ్బందులు తమకు తొలగిపోతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సురక్షిత నీటి సరఫరా వల్ల గ్రామీణ ప్రజలకు కూడా త్రాగునీటి ద్వారా సంభవించే 70 రకాల రోగాలను డోర్లు చేయవచ్చునని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. కుటుంబాలను అనారోగ్య కారణాలు ఆర్థికంగాఇబ్బంది పెట్టే పరిస్థితి భవిష్యత్తులో ఉండదన్నారు. ఇందువల్ల ప్రజల జీవన ప్రమాణాలు సంతృప్త స్థాయికి చేరతాయన్నారు. వారి కుటుంబాల్లో సంతోషాలు వెల్లి విరుస్తాయని ఆశాభావం మంత్రి నిమ్మల వ్యక్తం చేశారు.