Skip to main content

Telugu News Power

మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం. నలుగురిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు.

బాణా సంచా సామాగ్రితో క్రేన్ పై మండుతున్న వ్యాన్

జనరల్ డెస్క్: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్)
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా బడ్నగర్‌లో మొహర్రం ఊరేగింపు సందర్భంగా బాణాసంచాతో నింపిన వాహనాన్ని క్రేన్‌తో సుమారు 40 అడుగుల ఎత్తుకు ఎత్తి పేల్చిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో శుక్రవారం వైరల్ అయింది.ఈ ఘటనపై పోలీసులు నిర్వాహకుడు షోయబ్ ఖాన్‌తో పాటు ఈ ఫీట్ లో పాల్గొన్న మరో ఇద్దరు వ్యక్తులు, క్రేన్ యజమానిపై కేసు నమోదు చేశారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించే ప్రమాదకర విన్యాసంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం వాహనంలో పేలుడు పదార్థాలు కాకుండా బాణాసంచా ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు.