Skip to main content

Telugu News Power

యలమంచిలి ఎస్సై గురవయ్య సస్పెన్షన్ గుట్టుగా ఉంచిన అధికారులు.

భీమవరం: ఏప్రిల్, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) యలమంచిలి ఎస్సై కే.గురవయ్య విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడి ఇప్పటికే వారం రోజులు అయింది. ఇంతవరకు ఆ విషయం బయటకు పొక్కకుండా అధికారులు గుట్టుగా ఉంచారు. ఇందుకు బలమైన కారణం ఏదో ఉందని ప్రజలు, పార్టీల వారు చర్చించుకుంటున్నారు. స్థానిక బూరుగుపల్లి గ్రామంలో
ఈ నెల 16న నూకాలమ్మ జాతరలో జరిగిన భయానక ఘర్షణ దేవరపు వీరాస్వామి (75) అనే వృద్ధుడ్ని బలి తీసుకుంది. రౌడీషీటర్లతో వచ్చిన నిందితులు అసలు టార్గెట్ అయిన మరో ఇద్దరు, బ్రతుకు జీవుడా అంటూ, తప్పించుకున్నారని ప్రచారం జరిగింది. గతంలో నిందితుడు, అతని దాయదులతో ఏర్పడిన వివాదంలో కూడా గురువయ్య పాత్ర ఎస్పీ వరకు వెళ్లినట్టు తెలిసింది. ఈ కేసులో పోలీసులు అత్యంత సమర్థవంతంగా విచారణ చేపట్టారు. ఇప్పటికే 14 మందిని అరెస్టు చేశారు. తిరిగి రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.