భీమవరం: ఆగస్టు,30( తెలుగు న్యూస్ పవర్. కాం) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్ కి భీమవరం కి చెందిన మంగిన గురుమూర్తి నాయుడు 8 గ్రాముల బంగారం విరాళంగా అందజేసారు వీరికి ఆలయ అర్చకులు పూజలు, ఆశీర్వచనాలు అందచేసినారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం శేషవస్త్రం, ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్ పాపొలు ఏడుకొండలు ప్రసాదం, అమ్మవారి చిత్రపటం బహుకరించారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆదివారం తెలిపారు.
శ్రీ మావుళ్ళమ్మకు మంగెన వారి కాసు బంగారం కానుక.
దాతను సత్కరిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు