Skip to main content

Telugu News Power

యూత్ హాస్టల్స్ అసోసియేషన్, ఆంధ్రా అధ్యక్షులుగా, డాక్టర్ వర్మ.

డాక్టర్ వర్మ సత్కార కార్యక్రమంలో పాల్గొన్న యువత హాస్టల్స్ సభ్యులు

పాలకొల్లు: ఆగస్టు,23(తెలుగు న్యూస్ పవర్) యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర శాఖకు అధ్యక్షులుగా డాక్టర్ కె ఎస్ పి ఎన్ వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా, స్థానిక యూత్ హాస్టల్స్ అధ్యక్షులు పెద్దిబొట్ల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో డాక్టర్ వర్మ కు ఘన సత్కారం జరిగింది. ఈ సభకు నరసింహారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, భాస్కర్, కార్యదర్శి, వి ప్రసాద్, కోశాధికారి, సొలస సుబ్బారావు, మాజీ అధ్యక్షులు అచ్యుతరామరాజు, రవీంద్రనాథ్,దేవత వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.