జనరల్ డెస్క్: ఆగస్టు, 25 ( తెలుగు న్యూస్ పవర్. కామ్)
ఉజ్బెకిస్థాన్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్ (ఐసీహెచ్ఒ) 2026లో భారత విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి దేశానికి పేరుప్రతిష్టలు తెచ్చారు. ఈ పోటీల్లో పాల్గొన్న నలుగురు భారతీయ విద్యార్థుల బృందం ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలు సాధించగా, అందులో ఐఐటీ బొంబాయిలో సీఎస్ఈ ( సి ఎస్ ఈ ) అభ్యసిస్తున్న కబీర్ చిల్లార్ ఒకరు.
కబీర్ సాధించిన విశేష విజయాలు:
ఐ సీ హెచ్ హ్ ఒ 2026, ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో భారత్ తరఫున గోల్డ్ మెడల్ సాధించి గ్లోబల్ వేదికపై మెరిశారు.
జె ఈ ఈ మెయిన్ 2026, జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్ 2026లో 300/300 పర్ఫెక్ట్ స్కోర్‌తో (100 పర్సంటైల్) అఖిల భారత మొదటి ర్యాంక్ (ఎఐఆర్ 1) కైవసం చేసుకున్నారు.
జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో 360 మార్కులకు గాను 329 మార్కులు సాధించి, ఆల్ ఇండియా 2వ ర్యాంక్ (ఎఐ ఆర్ 2) కైవసం చేసుకున్నారు. మొదటి ర్యాంకర్ శుభమ్ కుమార్ కంటే ఈయన కేవలం ఒకే ఒక్క మార్కు వెనుకబడటం గమనార్హం.
ప్రస్తుతం కబీర్ చిల్లార్ దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన ఐఐటీ బొంబాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ ) విభాగంలో బి.టెక్ చదువుతున్నారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నుండి అంతర్జాతీయ ఒలింపియాడ్ వరకు ప్రతి పోటీలోనూ అగ్రస్థానంలో నిలుస్తూ కబీర్ జన్ జి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
రసాయన శాస్త్రంలో రాణిస్తున్న కబీర్ చిల్లార్. ఐఐటీ బొంబాయి విద్యార్థికి అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం!
గెలిచిన పథకాలతో కబీర్ చిల్లార్