పాలకొల్లు: మే,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతుల కుటుంబాల్లో ఆనందానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో రూ. 5.15 కోట్ల నిధులతో జరుపు తలపెట్టిన అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా తెల్లపూడిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 46’లక్షల మంది రైతులకు ఇప్పటివరకు
రూ. 8,965 కోట్ల రూపాయలు జమ చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1679 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా17. 47 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగిందన్నారు. రాష్ట్రంలో 1,67,257 మంది రైతులకు, 24 గంటల్లోనే ధాన్యం సొమ్ము రూ.3,870 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసి రికార్డ్ సృష్టించామని వెల్లడించారు. గత వైసిపి ప్రభుత్వంలో రైతులు తమ కష్టార్జితాన్ని పొందటానికి ఏళ్ల తరబడి ఎదురుచూసిన పరిస్థితులను ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1,640 కోట్ల సొమ్ము కూటమి ప్రభుత్వం వచ్చాక చెల్లించిందని వివరించారు. లంకల కోడేరు, దగ్గులూరు, బల్లిపాడు, జొన్నల గురువు, శివదేవుని చిక్కాల, తిల్ల పూడి గ్రామాల్లో మండుటెండలో మంత్రి విద్యుత్ మోటార్ సైకిల్ పై పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రికి ఘన స్వాగతం లభించింది. శ్రీరాముడికి శబరి పళ్ళు అందించినట్లు, రామానాయుడుకు అభిమానులు మండుటలు ప్రయాణించిన సందర్భంగా ముంజలు రుచి చూపించారు. తెల్ల పూరి సభలో గ్రామ ప్రముఖులు కామిశెట్టి రంగారావు, అయ్యప్పనాయుడు తదితరులను మంత్రి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, ఏం సి చైర్మన్ కోడి విజయభాస్కర్, జడ్పిటిసి నడపల గోవిందరాజులు, నాయుడు, పాముల రజిని కుమార్, మామిడి శెట్టి పెద్దిరాజు, కలిదిండి రామచంద్ర రాజు, బోడపాటి కాశీ విశ్వనాథం,నడపన జగపతి, ఇంటి శ్రీరాముడు, చొప్పల రజని, ఆకుల ధనలక్ష్మి, పీతల శ్రీనివాస్ సాధనాల దుర్గా బాబు, తదితరులు పాల్గొన్నారు.
రైతు కుటుంబాల ఆనందానికి కూటమి ప్రభుత్వం అండ. -మంత్రి నిమ్మల
శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నిమ్మల