Skip to main content

Telugu News Power

రైతు సమస్యలు తెలుసుకుంటున్న ఎంపీ వర్మ

పోలవరం మండలం గూటాల గ్రామం లో ఎత్తిపోతల పంప్ హౌస్‌ను స్థానిక బీజేపీ నాయకులు కె.నాగరాజు, స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు, కేంద్రమంత్రి, ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ సందర్శించి పరిశీలించారు.

గూటాల ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 2,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉండగా, మూడు పంపింగ్ మోటార్లలో ప్రస్తుతం ఒకటి మాత్రమే పనిచేస్తుండటంతో రైతులకు తగినంత సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సమస్యను సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి, వీలైనంత త్వరగా పరిష్కరించేలా, రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మల కిషోర్ , బీజేపీ కోనసీమ జిల్లా ఇంచార్జ్ కారంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.