Skip to main content

Telugu News Power

కొలువు దిగిన రోటరీ క్లబ్ కొత్త కార్యవర్గం.

రోటరీ క్లబ్ పాలకొల్లు ప్రమాణ స్వీకారోత్సవం

పాలకొల్లు: జూలై, 16( తెలుగు న్యూస్ పవర్. కామ్) రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు నూతన కార్యవర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. స్థానిక అలయన్స్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఇన్స్టాలేషన్ అధికారిగా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ సి దామోదర్ రెడ్డి వ్యవహరించారు. అధ్యక్షులుగా గుడాల హరిబాబు, కార్యదర్శిగా ఎస్ ఎస్ ఆర్ నాగార్జున రావు, కోశాధికారిగా ఆరమిల్లి సురేష్, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రోటరీ క్లబ్ ప్రజలకు చేస్తున్న వివిధ సేవలను ఈ సందర్భంగా వివరించారు. ఆత్మీయ అతిథిగా మాజీ మంత్రి ఎంపీ చుగుండి హరి రామ జోగయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, వృద్ధులకు వస్త్ర దానం కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా, కమిషనర్ టీ కిరణ్ కుమార్ హాజరయ్యారు. డాక్టర్ ముచ్చర్ల సంజయ్, కటారి నాగేంద్ర కుమార్, పెనుమాక రామ్మోహన్రావు, ముత్యాల శ్రీనివాస్, డాక్టర్ కోసూరి రామకృష్ణ ఆనంద రాజు, కోటి రామచంద్ర రాజు, పోతబత్తుల సత్యనారాయణ, మైగాపుల రాంబాబు, మద్దాల రాంప్రసాద్, గన్నాబత్తుల శ్రీనివాసరావు, జక్కంపూడి కుమార్ తదితరులు పాల్గొన్నారు.