Skip to main content

Telugu News Power

వసతి గృహాలు అన్ని సౌకర్యాలతో సిద్ధం చేయాలి. -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు.

వసతి గృహాల సౌకర్యాలు కల్పన పై చర్చిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి: ఏప్రిల్, 13 (తెలుగు న్యూస్ పవర్. కాం) వచ్చే విద్యా సంవత్సరం,పాఠశాలలు పునః ప్రారంభం నాటికి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు పూర్తి వసతులతో సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి క్షేత్రస్థాయిలో వివిధ శాఖల పనితీరుపై సోమవారం సమీక్షించ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.