Skip to main content

Telugu News Power

కూటమి ప్రభుత్వానికి ప్రచార సారథులు మీరే కావాలి. -మంత్రి నిమ్మల.

పాలకొల్లు: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వానికి మీరే ప్రచార సారథులు కావాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవమనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను సోమవారం రాత్రి తన క్యాంపు కార్యాలయం వద్ద లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వారు ఉద్దేశించి మాట్లాడుతూ, కోటలు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు పెంచాలని కోరారు. జగన్ సాక్షి పత్రిక ఉందని, ప్రభుత్వానికి సొంత ప్రచార సాధనాలు ఇవి లేవని తెలిపారు. అందువల్ల తాము పొందిన ప్రభుత్వ ఉపకారాల గురించి ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 97 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 58 లక్షల విలువైన చెక్కులను పేద, మధ్య తరగతి వర్గాల వారికి అందజేశారు.