Skip to main content

Telugu News Power

విఘ్ననాధునికి వెండిపాలవెల్లికి రాకుమారి రూ. 2.50 లక్షల విరాళం.

వెండి పాలవెల్లి తో విఘ్ననాధుడు.
పాలవెల్లి సమర్పిస్తున్న భక్తురాలు రాకుమారి

భీమవరం:సెప్టెంబర్, 12
(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఉపాలయము శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి భీమవరం కి చెందిన గిన్నీ రామకుమారి రెండు లక్షల యాభై వేలు విలువ చేసే 1.037 కేజీల వెండి పాలవెల్లి విరాళంగా సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజ, ఆశీర్వచనం నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్ ఉదిశి మీనాక్షి,మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతెన రమణ,యండా సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పాపొలు ఏడుకొండలు శేషవస్త్రం, అమ్మ వారి ప్రసాదం, చిత్రపటం అందజేసారు.