
శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్ కు కొత్త పూసలమోరుకి చెందిన ఎస్. ఐ. ఐ. పద్మారావు 4 గ్రాముల బంగారం, శ్రీ అమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన వితరణకు హైదరాబాద్ కి చెందిన బి శ్రీ ఉజ్వల్ రెడ్డి రూ.50వేలు విరాళంగా అందజేసారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ శేషవస్త్రం, అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రం అందజేసారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శనివారం తెలిపారు.