తిరుమల: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) గత వైసిపి ప్రభుత్వం దేవాదాయ శాఖను నిర్వీర్యం చేసిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. మంత్రి మంగళవారం తిరుమలలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క శాఖ కూడా అధిపతి లేకుండా ఐదేళ్లు అస్తవ్యస్త పాలన సాగించిందన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ, అంతర్వేది రథం దహనం, రామతీర్థం విగ్రహ ఖండన వంటి హిందూ వ్యతిరేక దుర్మార్గాలకు ఒడిగట్టారని విమర్శించారు. ఆ చీకటి రోజుల నుంచి విముక్తి చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాదాయ ధర్మాదాయ శాఖ సంపూర్ణంగా ప్రక్షాళన చేసినట్టు తెలిపారు. రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దినట్టు పేర్కొన్నారు. భక్తుల విశ్వాసాలను, నమ్మకాన్ని పునరుద్ధరించినట్టు తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
వైసిపి పాలనలో దేవాదాయ శాఖ నిర్వీర్యం. -మంత్రి ఆనం ఆరోపణ
పత్రికా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఆనం