Telugu News Power

వచ్చేనెల 1న వాసవి మాత విగ్రహ ప్రతిష్ట.

అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరిస్తున్న వైశ్య ప్రముఖులు.

పాలకొల్లు: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నరసాపురం రోడ్డులో ఉన్న గా మాస్ కళ్యాణమండపం ఆవరణలో కోటిన్న రూపాయలతో నిర్మించిన అమ్మవారి ఆలయంలో శ్రీ వాసవి మాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తరలి రావాలని వైశ్య ప్రముఖులు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక స్థానిక కంచర్ల పురుషోత్తం వాసవి కళ్యాణ మండపం లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు గారి జనార్ధన గుప్త వివరాలు వెల్లడించారు. విగ్రహ ప్రతిష్ట జూలై 1 జరుగుతుందన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యక్షులు సిద్ధ సూర్య ప్రకాష్, జయశ్రీ దంపతులు, జిల్లా వైశ్య ప్రముఖులు పాల్గొంటారని వెల్లడించారు. గత మూడు దశాబ్దాలుగా ఈ ఆలయ నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు. దాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వైశ్యులందరూ ఈ కార్యక్రమానికి భారీగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కొప్పు సుబ్బారావు, మాఘం శ్రీనివాసరావు, తెలనాకుల కోటేశ్వరరావు,మాటూరి వీర వెంకట నరసింహమూర్తి, దర్శి శ్రీనివాస గుప్తా, తదితరులు పాల్గొన్నారు