Skip to main content

Telugu News Power

శ్రీ అద్దేపల్లి కళాశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం.

అంతరిక్ష దినోత్సవం పోటీల్లో విజేతలకు బహుమతి ప్రథమ మహోత్సవం

పాలకొల్లు: ఆగస్టు, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ అద్దేపల్లి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం సోమవారం నిర్వాహంచారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రత్నమాణిక్యం అధ్యక్షతన భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, 2023 ఆగస్టు 23న భారతదేశం చంద్రయాన్–3 ద్వారా చంద్రునిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని గుర్తుచేసుకోవడమే ఈ దినోత్సవం ముఖోద్దేశ్యం అన్నారు.
చంద్రయాన్–3 విజయం భారత శాస్త్రవేత్తల ప్రతిభకు, కృషికి, పట్టుదలకు మరియు శాస్త్రీయ ఆలోచనా విధానానికి నిదర్శనమని,ఈ విజయం ప్రతి భారతీయుడికి
గర్వ కారణమన్నారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా బూసి వెంకటస్వామి మాట్లాడుతూ చంద్రయాన్–3 విజయం మనకు క్రమశిక్షణ, పరిశోధన, టీమ్ వర్క్, సమస్య పరిష్కార నైపుణ్య నిరంతర అభ్యాసం ఎంత ముఖ్యమో తెలియజేస్తుందని,
నాణ్యమైన విద్యలో విద్యార్థుల్లో కేవలం పుస్తక జ్ఞానాన్ని మాత్రమే కాకుండా, పరిశోధనా దృక్పథం, సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచన మరియు ఆవిష్కరణ సామర్థ్యాలను పెంపొందించడం ముఖ్యమన్నారు.అకడమిక్ కోఆర్డినేటర్ జి సుమలత మాట్లాడుతూ శాస్త్రవేత్తలు కూడా ఎన్నో సవాళ్లు, వైఫల్యాలు ఎదుర్కొని విజయాలను సాధించారని. వైఫల్యాలకు భయపడకుండా కొత్త విషయాలను నేర్చుకోవాలి, ప్రశ్నించాలి, ప్రయోగాలు చేయాలి మరియు కొత్త ఆలోచనలను అభివృద్ధి చేయాలన్నారు.
భౌతిక శాస్త్ర విభాగం ఇంచార్జ్ బికేవి రామలక్ష్మి అధ్యాపకురాలు పి. రామమణి జాతీయ అంతరిక్ష దినోత్సవం యొక్క చరిత్రను వివరించారు. డి. వికాస్ అనే విద్యార్థి చంద్రయాన్ యొక్క ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ కాంపిటేషన్ లో గెలిచిన విద్యార్థినీ విద్యార్థులకు మరియు పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు బహుమతులు అందజేశారు