Skip to main content

Telugu News Power

శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం.

ఎస్ ఐ పి కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్

పాలకొల్లు: సెప్టెంబర్,28( తెలుగు న్యూస్ పవర్.కామ్) శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశంసోమవారం జరిగింది. ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్ (ఎస్ ఐ పి ) కార్యక్రమాలలో భాగంగా చివరి రోజు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.రత్న మాణిక్యం ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.రత్న మాణిక్యం మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కళాశాల అధ్యాపకులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకమన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతూ, విద్యతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థుల హాజరు, విద్యా ప్రగతి, ప్రవర్తనపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని కోరారు. కళాశాలలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు.
తల్లిదండ్రులు మాట్లాడుతూ, ఎస్ ఐ పి కార్యక్రమం ద్వారా తమ పిల్లలకు కళాశాల వాతావరణం, విద్యా విధానం, వివిధ కార్యక్రమాలపై మంచి అవగాహన కలిగిందని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధికి కళాశాల యాజమాన్యం,అధ్యాపకులు చేస్తున్న కృషిని అభినందించారు. విద్యార్థుల విద్యా ప్రగతికి తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు డాక్టర్ ఎస్ వి రంగారావు, కారుమూరి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ, తాము చదువుకున్న కళాశాలతో తమ అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుత విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ విద్యార్థి జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకుంటూ, విద్యార్థులకు పలు విలువైన సూచనలు, మార్గదర్శకత్వాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ, ఐక్యూఎసి కోఆర్డినేటర్ డాక్టర్ బి వెంకటస్వామి, అకడమిక్ కోఆర్డినేటర్ జి సుమలత, జెకెసి కోఆర్డినేటర్ కే శామ్యూల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వి డి వి విజయలక్ష్మి, పి శ్రీనివాసరావు తదితర అధ్యాపకులు,పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్ ఐ పి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.