Skip to main content

Telugu News Power

నరసాపురం – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు పునరుద్ధరించాలి.

కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేస్తున్న జక్కంపూడి బృందం

భీమవరం: సెప్టెంబర్,28
(తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి, స్థానిక పార్లమెంటు సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మను స్థానిక బిజెపి నాయకులు క్యాంపు కార్యాలయంలో కలిశారు.
నరసాపురం నుంచి వైజాగ్ కు రెగ్యులర్ గా ప్రతిరోజు రైలు నడపాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
నరసాపురం, పాలకొల్లు, కోనసీమ ప్రాంత ప్రజలు విశాఖపట్నం వెళ్లడానికి నేరుగా రైలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలతో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్లు గౌరవప్రదంగా ప్రయాణించలేకపోతున్నారని తెలిపారు. కే జీ హెచ్, ఇతర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు వెళ్లే రోగులు, నిడదవోలు, భీమవరం వద్ద రైళ్లు మారాల్సి వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.

నరసాపురం, పాలకొల్లు, కోనసీమ నుండి ఆంధ్ర యూనివర్సిటీ, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, డైలీ బిజినెస్ చేసేవారు, ఆక్వా రైతులు, విశాఖపట్నం లోని పోర్టు, ఫిషింగ్ హార్బర్ ఉద్యోగులు డైలీ రైలు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు.
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ, నరసాపురం – అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి, పాలకొల్లు క్షీరారామం, పంచారామాలు, మావటూరమ్మ, ఫక్కీలు, కేసర రామలింగేశ్వర, పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి, ద్రాక్షారామం – మాణిక్యాంబ, అన్నవరం సత్యనారాయణ స్వామి, సింహాచలం – సింహాద్రి అప్పన్న, అరకు లోయ వంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను కలిపే టెంపుల్ టూరిజం సర్క్యూట్ గా ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుందని, రైల్వే ఆదాయం కూడా పెరుగుతుందని వినతి పత్రంలో పేర్కొన్నారు. నరసాపురం – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలును తక్షణమే డైలీ రైలుగా పునరుద్ధరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జక్కంపూడి కుమార్, డి ఆర్ యూ సి సి సభ్యులు,కొల్లి కొండ ప్రసాద్,కాశీరాజు,నాగరాజు,
చిన్నబాబు,చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పాల్గొన్నవారు.