Telugu News Power

శ్రీ ఏ యస్ యన్ యం కళాశాలలో అల్లూరి జయంతి వేడుకలు.

పాలకొల్లు: జూలై, 4( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
శ్రీ అద్దేపల్లి
సత్యనారాయణమూర్తి
ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల, పాలకొల్లు, తెలుగు విభాగం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ ముఖ్య అతిథిగా హాజరుకాగా, తెలుగు శాఖధిపతి డాక్టర్ బూసి వెంకటస్వామి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం జరిగిన సభలో వైస్ ప్రిన్సిపల్ శ్రీ టి. కృష్ణ మాట్లాడుతూ,మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, బ్రిటీష్ పాలకులపై చేసిన సాయుధ పోరాటం మరియు ఆయన త్యాగాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.తెలుగు శాఖధిపతి డాక్టర్ బూసి వెంకటస్వామి మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను సాధించడమే యువత వారికిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో డాక్టర్ సిహెచ్ ఉషారాణి, డాక్టర్ వి విజయలక్ష్మి, జి డి శ్రీనివాసరావు,పి శ్రీనివాసరావు, ఏ వంశి సుబ్బరాయన్ ,సి హెచ్ రవికుమార్ ,కె పార్ధసారధి,బి రామలక్ష్మి ,కె శివకృష్ణ ,వి శిరీషా ,డి మన్మధరావు,బి ఆశా జ్యోతి ,పి దుర్గారావు ,వి రమేష్ ,కె రోహిత్,పి జోత్స్నాశ్రీ ,డి హెప్సిరాణి,యం దివ్య ,జి వేణుమాధురి ,యం శిరీషా ,యస్ శ్రీదేవి ,సూపరిండెంట్ శ్రీమతి బి కనకలక్ష్మి,సీనియర్ అసిస్టెంట్ రమణమూర్తి ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు