Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మకు రూ.1.10 లక్షల బంగారు కానుక.

భీమవరం: ఏప్రిల్,27(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి, నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి భీమవరం కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త భీమాల శ్రీరామమూర్తి సమీప బంధువు నిమ్మల దినేష్ లక్ష పదివేలు రూపాయలు విలువగల 8 గ్రాముల బంగారాన్ని స్థానిక శాసన సభ్యులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చేతులమీదుగా శ్రీ అమ్మవారికి సమర్పించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఆశీర్వచన పూజలు నిర్వహించారు.దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, వుదీశి మీనాక్షి,అతికెల ఆంజనేయ ప్రసాద్,మిర్తిపాటి గుణేశ్వరరావు,మల్లువలస లక్ష్మి నిర్మల, పాపోలు ఏడుకొండలు దాతలకు అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందచేసారు.

శ్రీ మావుళ్ళమ్మకు బంగారు కానుక సమర్పిస్తున్న భక్తులు