Skip to main content

Telugu News Power

క్షీరా రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న రైల్వే అధికారిణి ఇతి పాండ్య.

పాలకొల్లు: మే,8(తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని శుక్రవారం ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండ్యా దర్శించుకున్నారు. ఈమె, సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్నారు.స్వామీవారు అమ్మవార్లూను దర్శనమునం చేసుకున్నారు. దేవస్థానం తరపున అధికారులు శేష వస్త్రం తో సత్కరించినారు. వీరికి పూజా కార్యక్రమాలు, నిర్వహించి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప అనిల్ అందజేసినారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డిప్యూటీ కమర్షియల్ మేనేజర్,విజయవాడ బి. ప్రశాంత్ కుమార్, సీసీ ఇన్స్పెక్టర్, విజయవాడ ప్రదీప్ కుమార్, పాలకొల్లు రైల్వే స్టేషన్ స్టేషన్ మాస్టర్ సురేష్ , ఆలయ కార్య నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు,ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, పర్యవేక్షకులు పసుపులేటి వాసు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఇతి పాండ్యా ను శేష వస్త్రంతో సత్కరిస్తున్న ఆలయ అధికారి పి వాసు