
భీమవరం: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు,, తెలుగు ప్రజలు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి
పట్టణానికి చెందిన కందకట్ల నాగేశ్వరావు, వారి కుటుంబ సభ్యులు, భీమవరం వైభవ్ శారీస్ అండ్ రేడిమెడ్స్ వారు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి . సుమారు 40 రకాల సారె సమర్పించారు. దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సారెలో నేతి మిఠాయిలు, పండ్లు, పసుపు, కుంకుమ, చలివిడి పానకం ఆదివారం ఉదయం సమర్పించారు. ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున స్వామి అధ్వర్యంలో వాటికి సంప్రోక్షణ జరిపి, శ్రీ అమ్మవారికి నివేదన చేశారు. అనంతరం సమర్పించిన సారె లోని పళ్ళు, మిఠాయిలు భక్తులకు, అర్చకులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పాపొలు ఏడుకొండలు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ వారి సిబ్బంది, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.