పాలకొల్లు: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్న వైసీపీ నాయకులను పాలకొల్లు శాసనసభ్యులు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. మంత్రి ఆదివారం పత్రిక సమావేశంలో మాట్లాడుతూ, అసలు క్రెడిటే లేని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీకి నేరాలు ఘోరాలు చేయటంలో ఎంతో క్రెడిట్ ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిన జగన్ ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల క్రితం పునాదిరాయి వేసిన వెలిగొండ ప్రాజెక్టును మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఈ సీజన్లో ప్రారంభించబోతున్నట్టు మంత్రి వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి 5 వేల కోట్ల రూపాయల పనులు మిగిలి ఉండగానే పూర్తయినట్టు ప్రకటించటం ఒక నిదర్శనం అన్నారు. నిర్వాసితులకు ఇవ్వవలసిన తొమ్మిది వందల కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా జగన్ ప్రభుత్వం చెల్లించలేదని స్పష్టం చేశారు. తన్నేళ్ళ పనులు పూర్తి చేయకుండా చుక్క నీరు కూడా ఇవ్వలేమని తెలిసిన వైసీపీ ప్రభుత్వం మిస్ చేతులెత్తేసింది అని ఆరోపించారు. నల్లమల సాగర్ రిజర్వాయర్ లో నీళ్లు నింపటానికి నిర్వాసితులకు అదనంగా 93 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినట్టు మంత్రి వెల్లడించారు. పనులు చేయకుండానే క్రెడిట్ కొట్టేయాలని జగన్మోహన్ రెడ్డి దురాలోచన ప్రజలు ఛీ కొడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రెడిట్ చోరీకి బ్రాండ్ అంబాసిడర్ జగన్. -మంత్రి నిమ్మల ఆరోపణ.
పత్రికా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల