Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మలు దర్శించుకున్న సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ.

శ్రీ మావుళ్ళమ్మ చిత్రపటం సేకరిస్తున్న జయ కృష్ణ

భీమవరం: జూలై 14, ( తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని ప్రఖ్యాత తెలుగు సినీ నటులు సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని జయ కృష్ణ మంగళవారం దర్శించుకున్నారు.ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,ఉదిశి మీనాక్షి,అతికెల ఆంజనేయ ప్రసాద్ కారెంపూడి ఆదిలక్ష్మి, మిర్తిపాటి గున్నేశ్వరరావు,గొంతెన రమణ,యండా సత్యవతి,గుసిడి నాగ శిరీష,పాపొలు ఏడుకొండలు ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందజేశారు.