Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో గణపతి నవరాత్రులు ప్రారంభం.

గణపతి నవరాత్రులు ప్రారంభిస్తున్న దృశ్యం

భీమవరం:సెప్టెంబర్,14( తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావులమ్మ అమ్మవారి ఉపాలయం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు కలశస్థాపన పూజ, వినాయక చవితి పూజ కార్యక్రమం ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, శిల్ప దంపతులు చే ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్ అతికెల ఆంజనేయ ప్రసాద్ పాపోలు ఏడుకొండలు పాల్గొన్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ సోమవారం తెలిపారు.