
పాలకొల్లు:సెప్టెంబర్,14
(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానమున సోమవారం సాయంత్రం మాడవీధుల్లో 300 మంది భక్తులు సప్త ప్రదక్షిణాలు చేసారు.ఈ కార్యక్రమములో ఆలయ కార్యనిర్వాహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ ఛైర్మన్ మీసాల రామచంద్రరావు,ఆలయ ధర్మకర్త నాళ్లం నాగ వెంకట సురేఖ, పర్యవేక్షకులు పి.వాసు,ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాత్రి ధూప సేవ, శ్రీ స్వామివారి పంచ హారతులు సేవ జరిగింది. వినాయక చవితి, సోమవారం కలసి రావడంతో రాత్రి కూడా మహాదేవుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అభిషేక పండిట్ మమ్మిడిపాటి వెంకన్న లీలా కళ్యాణ మండపంలో భక్తులకు వినాయక పూజా మహత్యాన్ని ప్రవచించారు. అత్యంత ప్రమాదకరమైన వ్యసనాల్లో ఒకటైన యోగంలో ధర్మరాజు ఓటమిపాలై సర్వం కోల్పోయినప్పుడు, విగ్రహాదుని పూజలు చేయడం ద్వారా మళ్ళీ పూర్వ వైభవం పొందారని వివరించారు. పమిడిపాటి వారి ప్రసంగాన్ని భక్తులు శ్రద్ధతో ఆలకించారు. ఈ సందర్భంగా భక్తులకు ఉండ్రాళ్ళు ప్రసాదం కైంకర్యం చేశారు. సిబ్బంది అర్చకులు రాత్రి వరకు భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా సేవలు అందించారు.