Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ సన్నిధిలో చండి హోమం.

శ్రీ మావుళ్ళమ్మ సన్నిధిలో చండీయాగం
చండీ హోమం వద్ద హాజరైన భక్తులు

భీమవరం: మే, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సన్నిధిలో వైశాఖ బహుళ అమావాస్య సందర్భంగా శనివారం ఆలయ అర్చకులు మరియు వేదపండితులు చండీహోమం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 92 మంది దంపతులు పాల్గొన్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు.ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు వుదీసి మీనాక్షి, గుసిడి జానకి నాగ శిరీష,పాపోలు ఏడుకొండలు పాల్గొన్నారు.