Telugu News Power

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో స్వచ్ఛంద కార్యక్రమం.

స్వచ్ఛంద కార్యక్రమం ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు అధ్యాపకులు.

పాలకొల్లు: మే 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయంప్రతిపత్తి
కళాశాలలో మూడవ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా “ప్లాస్టిక్ రహిత ఆంధ్రా” సాధనే ముఖ్య అజెండాగా ఎన్.ఎస్.ఎస్ I, II యూనిట్లు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. రత్న మాణిక్యం మాట్లాడుతూ, ప్లాస్టిక్ మహమ్మారి వల్ల భూగర్భ జలాలు, పర్యావరణం, మూగజీవాల ప్రాణాలు ఎంతలా దెబ్బతింటున్నాయో వివరించారు. రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ముఖ్యంగా, విద్యార్థి లోకం నడుం బిగించాలని, సమాజంలో మార్పుకు వారే వారధులు కావాలని పిలుపునిచ్చారు.
“ప్లాస్టిక్ రహిత ఆంధ్రా” కళాశాల ప్రాంగణంలో విద్యార్థులందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. “సింగిల్-యూజ్ ప్లాస్టిక్ (ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్)” ను పూర్తిగా బహిష్కరిస్తామని, తమ ఇళ్లను మరియు పరిసరాలను ప్లాస్టిక్ రహితంగా ఉంచుతామని విద్యార్థులు ప్రతినబూనారు.
ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, విద్యార్థులు, అధ్యాపకులు స్వయంగా రంగంలోకి దిగి కళాశాల ఆవరణంలోని, పరిసర ప్రాంతాలలోని ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలను సేకరించి మున్సిపల్ రీసైక్లింగ్ విభాగాలకు తరలించారు. కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఎం. రామకృష్ణ, డాక్టర్ వి డి. వి. విజయలక్ష్మి, డాక్టర్ సిహెచ్ ఉషారాణి, పి జోష్ణ శ్రీ,, ఎం శిరీష విద్యార్థులు పాల్గొని, ప్లాస్టిక్ లేని సుందర ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి తామంతా కట్టుబడి ఉంటామని చాటిచెప్పారు.