
పాలకొల్లు:ఆగస్టు,17( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు కుమారుడు దరహాస్ పుట్టినరోజు వేడుకలు సోమవారం నిర్వహించారు. దరహాసుకు స్వగృహంలో తల్లి సూర్యకుమారి, సోదరి శ్రీజ, బావ పవన్ సమక్షంలో కేక్ కట్ చేసి, దరహాసుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పాలకొల్లు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా, చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, హాజరైన ప్రజలు పుట్టినరోజు సందర్భంగా దరహాసును ఆశీర్వదించారు. నిమ్మల చేస్తున్న సామాజిక కార్యక్రమాల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన, ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.