హైదరాబాద్:ఆగష్టు, 15( తెలుగు న్యూస్ పవర్.కామ్)పాన్ ఇండియా డైరెక్టర్ బండ్రేడ్డి సుకుమార్, కుమార్తె సుకృతి వేణికి అంతర్జాతీయ సంగీత వేదికపై అరుదైన గౌరవం లభించింది. ఆమె తండ్రి కి తగ్గ తనయగా నిరూపించుకుంది. తెలుగు రాష్ట్రాలలో, ఆ మాటకొస్తే, దేశవ్యాప్తంగా, లెక్కల మాస్టర్ సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లోనే కాదు, ఇండియాలోనే గొప్ప దర్శకుల జాబితాలో ఈ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆయన మేకింగ్‌కు, టేకింగ్ గురించి రాజమౌళి సైతం గొప్పగా వర్ణిస్తాడంటే, ఆయన స్థాయేంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక పుష్ప సిరీస్‌తో దేశ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సుకుమార్, ఇటీవల నేషనల్ అవార్డుల్లో కూడా బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా మరో ఘనత సాధించాడు.
ఇక ఇప్పుడు సుకుమార్ బాటలోనే ఆయన కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. గతేడాది రిలీజైన ‘గాంధీ తాత చెట్టు’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే ఉత్తమ బాలనటిగా నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది. ఇక ఇప్పుడు సంగీత రంగంలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న ప్రతిష్ఠాత్మక బర్క్‌లీ కాలేజీ ఆఫ్ మ్యూజిక్ నిర్వహించే సమ్మర్ మ్యూజిక్ ప్రోగ్రామ్‌కు సుకృతి వేణి ఎంపికయ్యారు. అంతేకాదు.. అక్కడ ఎన్‌సెంబుల్ ఎక్సెల్లెన్స్ అవార్డు తో పాటు, ఫుల్ స్కాలర్‌షిప్‌ను కూడా సొంతం చేసుకున్నారు. ఈ స్కాలర్‌షిప్ కోసం మొత్తం 272 మంది విద్యార్థులు ఆడిషన్ ఇచ్చినట్లు సమాచారం. వారిలో కేవలం 14 మందికి మాత్రమే ఫుల్ స్కాలర్‌షిప్ లభించింది. ఇందులో మరింత విశేషం ఏంటంటే, గాయకుల విభాగంలో పూర్తి స్కాలర్‌షిప్ అందుకున్న ఏకైక విద్యార్థి సుకృతి వేణి ఒక్కరే కావడం.
నటనతో పాటు,
సంగీతంలోనూ,
చిన్న వయసులోనే సుకృతి వేణి తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘గాంధీ తాత చెట్టు’ సినిమాలో నటనకు గాను జాతీయ అవార్డు సాధించి, అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు సంగీతంలోనూ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుతున్నారు. ఇక బర్క్‌లీ కాలేజీ ఆఫ్ మ్యూజిక్ ప్రపంచవ్యాప్తంగా సంగీత విద్యకు ప్రసిద్ధి చెందిన సంస్థల్లో ఒకటి. అలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ నిర్వహించే కార్యక్రమానికి సుకృతి ఎంపిక కావడం, అందులోనూ పూర్తి ఉపకారవేతనం దక్కించుకోవడం విశేషం.
సినిమా రంగంలో సుకుమార్ తనదైన ముద్ర వేస్తుంటే, ఆయన కుమార్తె సుకృతి వేణి మాత్రం నటన, సంగీతం రెండు రంగాల్లోనూ తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన సుకృతి వేణికి సినీ ప్రముఖులు, అభిమానులు అభినందనల వెళ్ళువెత్తుతున్నాయి.
సుకృతికి సంగీతంలో అరుదైన అవకాశం. పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కు అభినందనలు.
తండ్రి సుకుమార్ తో తనయ సుకృతి