పాలకొల్లు:మే, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) చేగొండి అనంత శ్రీరామ్ స్థలం సూది మోపినంత ఆక్రమించినట్టు నిరూపించినా, తనకు అక్కడే ఉన్న మూడు కోట్ల స్థలాన్ని గిఫ్ట్ డీడ్ గా రాసి ఇస్తానని చేగొండి సూర్య ప్రకాష్ సవాల్ విసిరారు. ప్రముఖ సినీ గేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్, జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం తనపై ఇచ్చిన ఫిర్యాదు పై మాజీ మంత్రి, ఎంపీ హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్య ప్రకాష్ పత్రికా సమావేశంలో స్పందించారు. వారికి సదరు ఆస్థి ఎలా సంక్రమించిందో దస్తావేజుల పూర్వకంగా వివరించారు. తన కుమార్తెకు ఇచ్చిన స్థలాన్ని, పశువుల కొట్టంగా వాడుతూ, కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో, ఆ స్థలాన్ని రక్షించుకోవడం కోసం మాత్రమే తాను గోడ నిర్మించడానికి ప్రయత్నం చేసినట్టు తెలిపారు. ఎవరిదైనా అయినా సరే, తాను ఒక గజం భూమి ఆక్రమించినట్టు నిరూపిస్తే, తాను చేసే వ్యాపారం, రాజకీయాల నుంచి విరమించుకుంటానని వెల్లడించారు. అనంత శ్రీరామ్ కూడా అందుకు ఒప్పుకొని తన సినీ జీవితానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. అనంత శ్రీరామ్ ఇప్పటికే తన పెద్ద తండ్రి అబ్బిరాజుపాలెం ఆస్థి 9 ఎకరాలు కబ్జా చేసినట్టు తీవ్రంగా ఆరోపించారు. సరస్వతీ కటాక్షాన్ని, తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకో వద్దని హితవు పలికారు. నిజాయితీగా బ్రతకాలని కోరారు. తన ప్రతిష్టకు భంగం కలిగించిన అనంత శ్రీరామ్ ఆరోపణలపై అవసరమైతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు..
సూది మోపినంతనంత స్థలం ఉన్నా, మూడు కోట్ల స్థలం గిఫ్ట్ గా రాసిస్తా. అనంత శ్రీరామ్ కు సూర్యప్రకాశ్ సవాల్.
అనంత శ్రీరామ్ ఆరోపణపై వివరణ ఇస్తున్న చేగొండి ప్రకాష్