పాలకొల్లు: సెప్టెంబర్,29( తెలుగు న్యూస్ పవర్. కామ్)
గుజరాత్ సబర్మతి నుండి దేశంలోనే తొలి ఎల్ ఎన్ జి తో నడిచే రైలును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించడం భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని డి యూ ఆర్ సి సి సభ్యులు జక్కంపూడి కుమార్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ, మోదీ నాయకత్వంలో రైల్వే రంగం పూర్తి ఆధునీకరణ వైపు పరుగులు తీస్తున్నదన్నారు. గతంలో డీజిల్ మీదనే ఆధారపడే రైల్వే ఇప్పుడు పర్యావరణ హితమైన ఎల్ ఎన్ జి, హైడ్రోజన్ రైళ్ళు అందుబాటులోకి వస్తున్నాయన్నారు.
ఈ ఎల్ ఎన్ జి రైలలు సబర్మతిలో రూ. 1542 కోట్ల రైల్వే ప్రాజెక్టులలో భాగంగా ప్రారంభమైంది.
డీజిల్, ఎల్ ఎన్ జి తో కలిసి రెండు రకాల ఇంధనాలతో నడుస్తుంది. ఇందువల్ల 40 శాతం డీజిల్ ఆదా అవుతుంది. ఒకసారి 2,200 లీటర్ల ఎల్ ఎన్ జి ట్యాంక్ నింపితే 1,600 కి.మీ ప్రయాణం చేస్తుంది.
దీనితో పాటు రూ. 700 కోట్లతో డబ్ల్యూ ఏ జి -12 లోకో షెడ్, రూ. 411 కోట్లతో కవచ్ భద్రతా వ్యవస్థను కూడా అమిత్ షా ప్రారంభించారు. రైల్వే అంటే
2014 కి ముందు నిర్లక్ష్యం, ఇప్పుడు ప్రపంచ స్థాయి హైడ్రోజన్ రైలు కలిగిన 4 దేశాలలో భారత్ ఒకటిగా నిలిచిందని, ఇది మోదీ దూరదృష్టికి నిదర్శనమని జక్కంపూడి కుమార్ తెలిపారు.