Telugu News Power

బాలికపై వృద్ధుడి అఘాయిత్యం.

ఆచంట: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కొడమంచిలికి చెందిన వెలగన వెంకట స్వామి (70) అని వృద్ధుడు ఏడేళ్ల బాలికపై అగైత్యానికి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. ఈ వృద్ధుడు గ్రామంలో బడ్డీ కొట్టు నడుపుతున్నాడు. బాలిక తినుబండారాలు కొనుక్కోడానికి వెళ్లిన సందర్భంగా, వృద్ధడు లైంగిక దాడికి పాల్పడ్డట్టు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుడు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు.

Read More

ఒక ఐడియా, నెలకు 8 లక్షల వరకు ఆదాయం, వలపు వల యువత విలవిల.

హైదరాబాద్: ఏప్రిల్, 8(తెలుగు మూవీస్ పవర్. కామ్) సోషల్ మీడియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయల మోసాలు రోజువారి జరుగుతున్నాయి. స్కామర్లు రకరకాల మార్గాల్లో అమాయకులతో ఆలోచిస్తాయి అధికారులు రాజకీయ నాయకులను బురిడీ కొట్టించి భారీగా సొమ్ము స్వాహా చేస్తున్నారు. ఈజీ మనీ కోసం ఇటీవల మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఊరి పెట్టుబడి కేవలం ఇనిస్టాలోఒక ఎకౌంటు. నెలవారి వీరి బ్యాంకు ఖాతాలో ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకు ఆదాయం వచ్చి పడుతుంది….

Read More

వాకర్స్ క్లబ్ సహాయం

పాలకొల్లు: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శంభునిపేటకు చెందిన విల్లూరి మేరీ రత్నకుమారికి స్థానిక వాకర్స్ క్లబ్ వారు 6వేల రూపాయలు సహాయం అందించారు. భర్తను కోల్పోయిన ఈమె, పక్షవాతానికి గురైన కుమారునితో ఇల్లు గడవని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న వాకర్స్ క్లబ్ ఈమెకు నిత్యవసరాలు, నగదు సహాయం బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తటవర్తి సుధాకర్ రావు, కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, జవ్వాజి కళ్యాణ్, ఉమా శంకర్, బసవరాజు,…

Read More

గోదావరి మోక్షధామానికి రూ.3 కోట్లు

పెనుగొండ: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్). స్థానిక సిద్ధాంతం ఘాట్ వద్ద గలశ్రీ కేదారేశ్వర స్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న స్మశాన వాటికలో “గోదావరి మోక్ష దామం” నిర్మాణానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం భూమి పూజ చేశారు. ఈ ప్రాజెక్ట్ సుమారు ₹3 కోట్ల వ్యయంతో, 62 సెంట్ల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఈ మోక్ష దామం ద్వారా స్థానిక ప్రజలకు అంత్యక్రియలు నిర్వహించడానికి శుభ్రమైన, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. కార్యక్రమంలో భాగంగా,…

Read More

ఇన్ఫోసిస్ లో ఛాంబర్స్ విద్యార్థులకు ఉద్యోగాలు.

పాలకొల్లు: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక బిఆర్ఆర్ అండ్ జికేఆర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఇద్దరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కే చార్మిలత మరియు పి. రేణుక లక్ష్మి లకు ఇన్ఫోసిస్ లొ ఉద్యోగాలు వచ్చినవి అని కళాశాల చైర్మన్ కె వి ర్ నరసింహ రావు తెలియజేశారు. కళాశాల చైర్మన్, కెవిఆర్ నరసింహారావు మాట్లాడుతూ, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజాల కంపెనీలో ఉద్యోగం లభించడం,కళాశాలలో అందించే అత్యుత్తమ విద్యా బోధనయే కారణమని, కళాశాలలో…

Read More

అఖండ జ్ఞానజ్యోతి అస్తమయం, మాడభూషి మరణం పట్ల పలువురి దిగ్భ్రాంతి.

పాలకొల్లు: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) అఖండ జ్ఞాన నిధి, సాహితీ స్రష్ట మాడభూషి కృష్ణ ప్రసాద్ (72) బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వారు ఊపిరితిత్తుల సమస్యకు చికిత్స పొందుతున్నారు. వీరి భార్య జయంతి, యలమంచిలి మండలం, అడవిపాలెం లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వీరి మరణ వార్త పాలకొల్లులో విషాదం నింపింది. కృష్ణ ప్రసాద్ సుదీర్ఘకాలం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పని చేశారు. పోడూరు మండలం, గుమ్ములూరులో, పాఠశాల సహాయకులు,…

Read More

ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం.

భీమవరం: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్.కాం) స్థానిక కలెక్టర్ కార్యాలయంలో, జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం మంగళవారం జరిగింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అన్ని శాఖల సమన్వయం పనిచేయాలని సూచించారు. కొత్త పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతుల ప్రక్రియ, రుణాలు మంజూరు వేగవంతంగా చేయాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపన కోసం ఇప్పుటి వరకు అందిన 1,727 దరఖాస్తుల్లో 1,707 యూనిట్లకు ఆమోదం తెలిపారు. మరో…

Read More

సాగునీటి సంఘాల అధ్యక్షులతో సమీక్ష.

పాలకొల్లు: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్. కామ్) జల వనరులపై ప్రభుత్వం ప్రకటించిన వందరోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా, మంగళవారం స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ పెనుమత్స రామభద్ర రాజు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి. మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామభద్రరాజు మాట్లాడుతూ, రాష్ట్ర జలవణుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు మురుగు కాలువల ప్రక్షాళన చేపట్టాలని…

Read More

అన్నవరం, ద్వారకాతిరుమల ఆలయాలకు ట్రస్ట్ బోర్డ్ ల నియామకం.

అమరావతి: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ దేవాలయాలైన అన్నవరం, ఆలయానికి,ద్వారకాతిరుమలకు దేవాదాయ శాఖ ట్రస్ట్ బోర్డు నియమకం మంగళవారం ప్రకటించింది. కాకినాడ జిల్లా అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం చైర్మన్‌గా, ఇనుగంటి వెంకట రోహిత్ పాటు 16 మంది ట్రస్ట్ బోర్డు సభ్యుల నియమితులయ్యారు. ద్వారకా తిరుమల ఆలయానికి చైర్మన్ గా, ఎన్ వి సుధాకరావుతో పాటు ధర్మకర్తలు నియమితులయ్యారు.13మంది టీడీపీ, 2 జనసేన, 1 బీజేపీ పార్టీల…

Read More

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్.

తాడేపల్లి: ఏప్రిల్, 7 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణపై ఏకకాలంలో నాలుగు చోట్ల ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా పలుచోట్ల ఖరీదైన భవనాలు, బంగారం, వెండి నగదు ఇబ్బడి ముబ్బడిగా కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అధికారిక ఫార్మాలిటీస్ పూర్తిచేసిన తరువాత, రాత్రికి ఆమె అరెస్టు చూపించారు. అత్యంత వివాదాస్పద…

Read More