వచ్చేవారం పట్టాలెక్కనున్న ప్రత్యేక రైళ్ళు – రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి, భూపతిరాజు శ్రీనివాస వర్మ.
పాలకొల్లు: ఏప్రిల్, 5(తెలుగు న్యూస్ పవర్.కామ్) నర్సాపురం(07219/07220)నుంచి తిరువణ్ణామలై (అరుణాచలం) మరియు బెంగళూరు(07153/07154) (ఎస్ఎంవిబి,) వరకు నడుస్తున్న ప్రత్యేక రైలు సేవలను దక్షిణ మధ్య రైల్వే వారు రద్దు చేశారన్న వార్త ఉభయగోదావరి జిల్లాలో ఆదివారం దావానలంలా వ్యాపించింది. స్థానిక ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయం మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈ రైళ్ళు కొనసాగించడానికి గతంలో రైల్వే అధికారులతో పలుసార్లు సమావేశమయ్యారు. వారి హామీతో ఈ రైళ్ళు ఇక నిరాగాటంగా నడుస్తాయని…