శ్రీ శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో ఘనంగా ఆదిశంకరుల జయంతి ఉత్సవం.
భీమవరం: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక శ్రీ శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో బుధవారం ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవం జరిగింది. జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దేవస్థాన మండపంలో ఏర్పాటు చేసిన విశేష కార్యక్రమం లో శ్రీ ఆదిశంకరుల చిత్రపటానికి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో దేవస్థానం వైదిక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిశంకరాచార్యులు కేవలం 32 ఏళ్ళ స్వల్ప కాలంలోనే…