Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో 9 వేల మందికి అన్న ప్రసాద వితరణ.

అన్నదాన కార్యక్రమం దృశ్యాలు

భీమవరం: అక్టోబర్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం, శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద శ్రీ దేవి శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా, గురువారం అన్నదానం కార్యక్రమం జరిగింది. సుమారు 9 వేల మంది భక్తులు ఈ మహా ప్రసాదం స్వీకరించారు..ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి హరి సూర్య ప్రకాష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ఆలయ ధర్మకర్తలు, రామాయణం శ్రీనివాస్, ఉదిసి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి శిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, మిర్తిపాటి గున్నేశ్వరరావు, మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతెన రమణ, యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పాపోలు ఏడుకొండలు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవకులు, పరువు భక్తులు మీ అన్నదాన కార్యక్రమానికి తమ సేవలు అందించారు.