
పాలకొల్లు: అక్టోబర్, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నర్సాపురం రోడ్డులో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా వేంచేసి ఉన్న ఉన్న శ్రీ సాయిబాబా ( పెద్ద సాయిబాబా) ఆలయంలో అంబాజీపేటకు చెందిన, పూర్వ న్యాయమూర్తి, కొర్లపాటి గోపాలరావు, చిట్టితల్లి దంపతుల సౌజన్యంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు
సుమారు 3వేల మంది భక్తులు ఈ అన్న ప్రసాదం స్వీకరించారు. శరన్నవరాత్రులు ముగింపు సందర్భంగా, భారీ సంఖ్యలో భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అల్లం సత్యనారాయణ, జడ్జ్ గోపాలరావుకు ఆలయ విశేషాలు వివరించారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి, భక్తులు విరాళం అందించటానికి ఉన్న అవకాశాలు గురించి వివరించారు. అన్నదాన కార్యక్రమంలో, గోపాలరావు కుటుంబ సభ్యులు, చేగొండి సీతారామస్వామి నాయుడు, జ్యోతి దంపతులు, వారి కుమారుడు,కుమార్తె, అల్లుడు, మనవడు, భక్తుల అన్నదాన వితరణ సేవలో పాల్గొన్నారు.
