పాలకొల్లు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో శనివారం ప్రమాణస్వీకారోత్సవం భారీగా నిర్వహించనున్నారు.కమిటీ లో ఏడు మంది పురుష డైరెక్టర్లు, 8మంది మహిళా డైరెక్టర్లు ఉన్నారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మాత్యులు కింజరాపు అచ్చం నాయుడు రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు హాజరు కానున్నారని తెలిపారు.మార్కెట్ కమిటీ నిర్మాణంలో పాత సంప్రదాయాలకు భిన్నంగా మంత్రి నిమ్మల తమదైన ముద్ర వేశారు. డైరెక్టర్ పదవులు 15 ఉండగా ఉపాధ్యక్షునితో సహా ఏడుమంది పురుషులకు, ఎనిమిది మంది మహిళలకు స్థానం కల్పించారు. ఈ విధంగా ఒకటి ఎక్కువైందన్నట్లు, మంత్రి మహిళా పక్షపాతిగా చెప్పదానికి ఇదో రుజువు అంటున్నారు.కోడి విజయభాస్కర్ పార్టీకి అంకితమైన నాయకులు. వారి శ్రీమతి జెడ్పీటీసీ సభ్యులు కావడం వల్ల ఇంతకాలం కొంగుచాటు నాయకులుగా ఉన్నారు. పార్టీనీ నమ్ముకొని ఉన్నందుకు వారు నేడు సముచితమైన నియోజకవర్గస్థాయిలో రెండవ పెద్ద పదవిగా ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి చేపట్టే అవకాశం అందుకొన్నారు.దాసరి రత్నంరాజు పోడూరు మండలం ఆచంట నియోజకవర్గంలో ఉన్నప్పటించి పార్టీకి సేవలు అందిస్తూన్న సీనియర్ నాయకులు. పోడూరు మండల అధ్యక్షులుగా పార్టీకి, వారికి మంచి పేరు తెచ్చుకున్నారు.
పాలకొల్లు పెదగోపురం ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా, ఏ ఎం సీ అధ్యక్షులుగా ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం సాహసోపేత నిర్ణయం మంత్రి నిమ్మలకే సాధ్యం. ఇది వారికి పార్టీ పై ఉన్న పట్టుకు నిదర్శనం.
గతంలో అప్పటి మంత్రి చేగొండి హరిరామజోగయ్య తన అనుచరులైన ఐతం బాబూ రావు ను, మొగల్తూరు నుంచి తెచ్చి పాలకొల్లు ఏ ఎం సీ అధ్యక్షులుగా చేయడం చర్చనీయ అంశం అయ్యింది. ఈ పదవి చాలా కాలంగా క్షత్రియ సామాజిక వర్గానికి కేటాయించేవారు. ఈ పదవి వైసీపీ పార్టీ ఎస్టీ మహిళ చివరిలో చేపట్టారు.
పాలకొల్లుకు పచ్చమహర్దశ నడుస్తున్నది. అందుకు సంబంధించిన అనేక భారీకార్యక్రమాలు వరదలా వచ్చిపడుతూనే ఉన్నాయి. అంతకు మిక్కిలిగా కార్యకర్తలు పార్టీ బాధ్యతలు భుజాలకెత్తుకొని, రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతూ, దటీజ్ నిమ్మల ఆర్మీ అనిపించుకొంటున్నారు.
మంత్రి నిమ్మల పార్టీనే తన కుటుంబంగా నమ్ముతారు. ఒక్కోసారి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేసి పనిలో మునిగిపోతారు. బుడమేరు వరద సమయంలో పాలకొల్లు నియోజకవర్గం పేరు మారుమ్రోగింది. తన కుమార్తె తాంబూలాల దగ్గర నుంచి వివాహం ఆ తరువాత కూడా పసుపురంగు తడిఆరకుండా పరంపరగా పార్టీ కార్యక్రమల్లో విరామం లేకుండా సాగిపోతున్నాయి. ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు బలమైన పునాది వేస్తూ, ప్రతిపక్షాల వెన్నులో వణుకుపుట్టించే పరిస్థితికి దారితీస్తుందంటున్నారు.నేటి భారీసభకు సంబంధించి ఫ్లెక్సీలతో పాలకొల్లులో ఒక్క అంగుళం కూడా ఖాళీ లేకుండా పోయింది. దాదాపు పదిహేను ఇరవై లక్షల భారీ బడ్జెట్ ఈ ఈవెంట్ కు అవసరం కావచ్చుమంటున్నారు. దాదాపు అయిదారువేల మందికి విందు ఏర్పాట్లు జరుగుతున్నట్లు విశ్వశనీయ సమాచారం.