పాలకొల్లు: ఆగస్టు, 3( తెలుగు న్యూస్ పవర్. కామ) స్థానిక 12వ వార్డులో సమగ్ర ఘన వ్యర్ధాల నిర్వహణ ఏర్పాటుకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. విజ్జేశ్వరం నుంచి నేరుగా గోదావరి జలాలు తరలించే పైపులైను పనులకు స్థానిక 18,25 వార్డుల్లో శంకుస్థాపనలు చేశారు. ఈ పనులకు రూ. 10.43 కోట్ల నిధులు మంజూరైనట్టు వెల్లడించారు. అధికారులు పనులు పారదర్శకంగా, నాణ్యతతో జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొన్నారు. మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, కర్నేని గౌరు నాయుడు, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, సిడగం సురేంద్ర, బోనం చినబాబు, ఉన్నమట్ల కపర్తి, తులా రామలింగేశ్వర రావు, తదితరులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపనలు.
పైపులైను పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నిమ్మల తదితరులు