Skip to main content

Telugu News Power

చాంబర్స్ కళాశాలలో అంతర్జాతీయ వాణిజ్య దినోత్సవం.

వాణిజ్య దినోత్సవం సందర్భంగా, వక్తలకు సత్కారం

పాలకొల్లు: ఆగస్టు, 3( తెలుగు న్యూస్ పవర్. కామ్) అంతర్జాతీయ వాణిజ్య దినోత్సవం సందర్భంగా స్థానిక డి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాల లో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కామర్స్ డే సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఓసూరి శ్రీదేవి ఫ్యాకల్టీ ఆఫ్ ఎంబీఏ స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విచ్చేశారు. వారు మాట్లాడుతూ, చాంబర్స్ కళాశాలలో వాణిజ్య దినోత్సవాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయమని, విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి ఈ కామర్స్ మరియు క్విక్ కామర్స్ , ఏఐ ఇన్ కామర్స్ వంటి వాణిజ్య శాస్త్రంలోని ఆధునిక పోకడల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు, మాట్లాడుతూ, వ్యాపారం లేదా వర్తకం జరిగే వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో నమోదు చేయడానికి వాణిజ్యం అంటారని, వాణిజ్యం ఉత్పత్తిదారుడు మరియు వినియోగదారుడు మధ్య వారిదిగా పనిచేస్తుందని ఇది ఉపాధి వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి మరియు ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అందువల్ల వాణిజ్యం ప్రతి దేశ అభివృద్ధికి అత్యంత అవసరమైన రంగం ఇటువంటి రంగంలో ఉద్యోగ అవకాశాలు అనేకం ఉంటాయని, ఈ కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఈ అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. కళాశాల సెక్రటరీ కె వి సీతారామరాజు మాట్లాడుతూ, వాణిజ్యంపై అవగాహన ఉపాధి అవకాశాలను పరిచయం చేస్తుందని వ్యాపార నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ వ్యవస్థాపకత భావనను ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, వస్తు సేవలను ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు చేరవేసే ప్రక్రియ కొనుగోలు అమ్మకాలు మాత్రమే పరిమితి కాకుండా రవాణా బ్యాంకింగ్ భీమా గిడ్డంగులు ప్రకటనలు అనేక సేవలు కూడా కలిగి ఉంటుంది దేశ ఆర్థిక అభివృద్ధిలో వాణిజ్యం అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇటువంటి కోర్సు ను అభ్యసిస్తున్నటువంటి బీకాం బీబీఏ మరియు జూనియర్ కళాశాల సీఈసీ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని వారికి అనేక రకమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ అడ్వైజర్లు ఏవీఎస్ మూర్తి, నందుల సీతారామారావు, కళాశాల కోసం చైర్మన్ నాళం శ్రీనివాస గుప్తా గారు కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. వాణిజ్య దినోత్సవం సందర్భంగా కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులకు పిపిటి ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, క్విజ్, ఎలక్యూషన్ ఎస్సే రైటింగ్ వంటి అనేక పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందించారు.