Skip to main content

Telugu News Power

వరద ప్రాంతాల్లో పర్యటించిన వైసీపీ నాయకులు, ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి.

వరద బాధితుల పరామర్శకు పడవలో వెళుతున్న వైసీపీ నాయకులు
వరద సహాయ కార్యక్రమాల గురించి తెలుసుకుంటున్న వైసిపి ఇన్చార్జి గోపి, ఎంపీపీ ధనలక్ష్మి రవికుమార్

యలమంచిలి: ఆగస్టు, 3( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండలం కనకాయలంక గ్రామంలో వరద ముంపు ప్రాంతాల్లో మండల అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి, పాలకోల్లు నియోజవర్గ ఇన్చార్జ్ గుడాల గోపి, యడ్ల తాతాజీ, మండల వైసీపీ అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు, స్థానిక నాయకులతో కలిసి సోమవారం పర్యటించారు. వరద నీటిలో మునిగిన ఇళ్లను పరిశీలించారు. వరద బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి తగు సూచనలు, జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైద్య శిబిరాల్లో అన్ని మందులు ఉంచాలని కోరారు.
మంచినీళ్లు ఇబ్బంది లేకుండా అధికారులు వెంటనే సరఫరా చేయాలని సూచించారు. అనారోగ్యాలు రాకుండా బ్లీచింగ్ చల్లాలని,కరెంటు సమస్య లేకుండా చూడాలి, అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వినుకొండ రవికుమార్, వైస్ ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మద్దా శ్రీనివాస్, గ్రామ అధ్యక్షులు చింద్రుపు గణపతి, సిర్రా నాగరాజు,మండల యూత్ అధ్యక్షులు పులి సుబ్రమణ్యం, యన్నాబత్తుల సుధీర్, బొండాడ బాపూజీ, పులి కాశీ, లంక కిషోర్, వలవల నరసింహమూర్తి, గెద్దాడ ఉదయ్ భాస్కర్,దిద్దే ప్రభాకర్ రావు,మార్ల పూడి రాజు, చింద్రుపు నాగేశ్వరవు, దిద్దే ప్రభాకర్,సరేళ్ళ ఆకాశ్ , తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.