Skip to main content

Telugu News Power

రైతు బజార్లో చౌక బియ్యం దుకాణాలు ప్రారంభం.

లబ్ధిదారునికి చౌక బియ్యం అందిస్తున్న దృశ్యం.

పాలకొల్లు: ఆగస్టు, 3( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఎల్ నినో ప్రభావంతో పంటలు సరిగా పాండవనే ముందస్తు అంచనాలతో వ్యాపారులు బియ్య ధరలు రోజురోజుకు పెంచుతున్నారు. ఒక్క వారంలోనే బియ్యం ధర రూ 15 నుంచి రూ.20 కేజీ ధర పెరిగిపోయిన సందర్భాల పట్ల మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లతో ముందుకు వచ్చింది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో స్థానిక రైస్ మిల్లర్ల దగ్గర, రైతు బజార్లలో చౌక ధరలకు బియ్యం అందించే ఏర్పాట్లు చేసింది. బిపిటి రకం ఉప్పుడు బియ్యం ధర బయట మార్కెట్లో రూ. 62 వరకు ఉంది. ప్రభుత్వం ఈ బియ్యాన్ని
రూ. 52 కు అందిస్తున్నారు. పచ్చి బియ్యం రూ. 58 లు ఉండగా, రూ 50 లకు తగ్గించి అమ్ముతారు. అయితే వీరికి బియ్యం కార్డు, ఆధార్ కార్డు ఉండాలి. వీటిపై పది కేజీల బియ్యం ఇస్తారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో గల రైతు బజారులో రాష్ట్ర బిజెపి నాయకులు, మాజీ ఏఎంసీ చైర్మన్, ఉన్నమట్ల కపర్తి, సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పాముల రజిని కుమార్, కనకదుర్గ దేవస్థానం చైర్మన్, జనసేన జిల్లా నాయకులు తులా రామలింగేశ్వర రావు, తహసిల్దార్ యడ్ల దుర్గా కిషోర్, ఎస్టేట్ అధికారి ఝాన్సీ రాణి, చౌక దుకాణం డీలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.