Telugu News Power

ఈ నెల 27నుంచి ధాన్యం సేకరణ ప్రారంభం

ఈ నెల, 27నుంచి సార్వ ధాన్యం సేకరణ ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవంలో ముఖ్యఅతిథి ప్రసంగం చేసారు. రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు సభకు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖామాత్యులు మాట్లాడుతూ మార్కెట్ కమిటీ లు ఉత్సవవిగ్రహాలుగా మిగిలి పోకుండా చైతన్య పరిచి వారి నిధులు వారే ఖర్చు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.రైతుల కోసం భూసార పరీక్షలు చేపట్టి వారి భూమికి సంబంధించిన వివరాలు, సూచనలు ఇస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఉల్లి, మామిడి, కోకో. పొగాకు పంటలు విపరీతంగా పండటం వల్ల ధరలు తగ్గినందు వల్ల వారికి ఆర్థిక సాయం చేసి ప్రభుత్వం ఆదుకొందన్నారు.మెడికల్ కాలేజీల వ్యవహారంలో వైసీపీ పార్టీ చేస్తున్న ప్రచారం లో వాస్తవం లేదన్నారు. పాలకొల్లు మెడికల్ కాలేజీ పూర్తి కాలేదని సభికులచే చెప్పించారు. పీపీపీ మోడల్ ప్రవేట్ పరం కాదన్నారు. గడువు తేరిన తరువాత ప్రభుత్వం స్వాదీనం లోకి వస్తాయన్నారు. దీనిపై చర్చకు రావాలని వైసీపీ పార్టీ కి సవాలు విసిరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగా ఉన్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామన్నారు., ఐదేళ్ళ వైసీపీ పార్టీ రెండు లక్షల కోట్లుకు బటన్ నొక్కితే, కూటమి ప్రభుత్వపాలనలో ఏడాదిన్నరలో లక్ష కోట్ల లబ్ధి డి బీ టీ ద్వారా ప్రజలకు. పాడైపోయిన రోడ్ల కోసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఐదు వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చి రోడ్లు బాగుచేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను ఊచకోత కోసినా రామానాయుడు, తను ఎదిరించి నిలబడ్డామన్నారు. రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడులా పాలకొల్లు నియోజక వర్గానికి నిమ్మల రామానాయుడు అలాంటి అభివృద్ధి చేస్తారన్నారు. మంత్రి నిమ్మల కృషి వల్ల జలాశయాలు అన్నీ కళతో నిండుకుండలా ఉన్నాయన్నారు. తన నియోజకవర్గలో కూడా ఇవ్వకుండా ముందుగా నిమ్మల రామానాయుడు వల్ల పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ కి 30లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలపై విధేయతను తరచూ మార్చడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది, ప్రజలు ఇది గమనించాలని కోరారు. సుదీర్ఘంగా సాగిన అచ్చెన్న ప్రసంగం నిబ్బరంగా, ఉద్వేగంగా ఆరున్న ఏళ్ల రాజకీయ పరిణామాలను తన అనుభవాన్ని రంగరించి సవివరంగా తెలియజేస్తూ సభికులను ఆకట్టుకున్నారు.రాష్ట్ర కార్మికశాఖామాత్యులు, జనసేన పార్టీ ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో పాలనపై పట్టు సాధించగలిగానన్నారు. ఆదరణ పథకం మళ్ళీ ప్రవేశపెట్టి వృత్తి పనివారలకు కిట్లు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.కాపు కార్పొరేషన్ అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రి మోడీ,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థవంతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారన్నారు. రాష్ట్ర మహిళా ఛైర్పర్సన్ మాజీ మంత్రి పీతల సుజాత, ఈ కమిటీ లో మహిళ కు పెద్ద పీట వేసిన మంత్రి నిమ్మల ను అభినందించారు. కమిటీ నూతన అధ్యక్షులు కోడి విజయభాస్కర్ తమ కమిటీ ఏర్పాటు కు నిమ్మల ఆశీస్సులే కారణమన్నారు. వైస్ చైర్మన్ దాసరి రత్నంరాజు మాట్లాడుతూ తెలుగు దేశం నాయకుల కృషినీ గుర్తించి పదవులు ఇస్తుందన్నారు. ఈ సభలో ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, అంగర రామ్మోహన్, ఏపీ ఐ ఐ డి సి ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే రామరాజు, బీజేపీ రాష్ట్ర మీడియా కన్వీనర్ ఉన్న్మట్ల కపర్ది, నర్సాపురం టీడీపీ ఇంచార్జి పొత్తూరి రామాంజనేయరాజు తదితరలు ప్రసంగించారు. కూటమీ నాయకులు,కార్యకర్తలు అధికసంఖ్యలో ఈ సభలో పాల్గొన్నారు.తెలుగుదేశం నాయకులు గండేటి వెంకటేశ్వర రావు జీవి, పెశ్చెట్టి బాబు, దీప్తి అప్పారావు, నీటి సంఘం అధ్యక్షుడు మాత రత్నంరాజు, పీతల శ్రీనివాస్ సభానిర్వహణలో సహకరించారు.