Skip to main content

Telugu News Power

సంక్రాంతి కానుకగా కాంబొంట్లపాలానికి సీ సీ రోడ్డు….#nimmala #Minister #Telugu #news

 

రైతులు, బలహీనవర్గాల, వెనుకబడిన తరగతుల ప్రజలు మాత్రమే ఉండే ఈ గ్రామం అంటే తమకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. ఈ గ్రామంలో కోటి ఎనభై లక్షల రూపాయలతో వేయనున్న సి సీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేసి,సభ లో మాట్లాడారు. రోడ్డు పనులు వేగంగా పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ప్రజలకు అంకితం చేస్తామన్నారు. ఇక రహదారి నరకం నుంచి బయటపడతారన్నారు. ఈ ఒక్క ఏడాది లోనే ఈ గ్రామానికి సి సీ రోడ్డు వేయడానికి వేయడానికి 20లక్షలు, గ్రావెల్ రోడ్లకు 13.80లక్షలు ఖర్చు చేశామన్నారు. ఆరోగ్య పరమైన పరిస్థితి వల్ల 13మందికి 6.40కోట్లు ఇచ్చామన్నారు. ఈ ఒక్క గ్రామానికే 3కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కూటమి ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమున్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులురాలు, వినుకొండ ధనలక్ష్మి, సర్పంచ్ అనిశెట్టి మల్లిక, ఎంపిటిసి కంబాల సత్యశ్రీ,
మేడపాడు ఎంపిటిసి డేగల సూర్య ప్రభ, మండల టీడీపీ అధ్యక్షులు మామిడిశెట్టి పెద్దిరాజు, జనసేన నాయకులు కొడవటి వరబాబు, మాజీ జడ్పీటీసీ బోనం నానీ, డేగల వెంకటేశ్వర రావు, నార్నిమేరక పిఎసిసి అధ్యక్షులు, జనసేన నాయకులు డేగల సత్తికొండ, పీతల శ్రీనివాస్ , పలువురు కూట మి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గొడుగులు వేసి వానలోనే మంత్రిని సన్మానించారు