పాలకొల్లు:నవంబర్,30 (తెలుగు న్యూస్ పపర్) ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఒకటో తేదీన ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటారు. ఎయిడ్స్ అంటే ఎక్వైర్ర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ. ఇది హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ వల్ల వస్తుంది. ఐక్యరాజ్యసమితి,ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 డిసెంబర్ ఒకటిన ఎయిడ్స్ దినోత్సవంగా ప్రకటించాయి. ఇందువల్ల ఎయిడ్స్ పట్ల ప్రభుత్వాలు ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి, ప్రచారం చేయడానికి, ఫలితాలు లెక్కించటానికి అనువుగా ఉంటుందని ఈ తేదీని నిర్ణయించారు. ఈ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ పై అవగాహన కలిగించడం, బాధితుల కు నైతిక బలం ఇవ్వడం, బాధితులను స్మరించుకోవడం, ప్రభుత్వాలు ఆరోగ్య సమస్యల దృష్టిని ఆకర్షించడం,సమాజం మొత్తం కలిసి పోరాటం చేయటం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది 95 శాతం మంది ఎయిడ్స్ చికిత్స తీసుకుంటున్నట్టు అంచనాలు చెబుతున్నాయి. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అంచనా మేరకు 132 కు 98 తగ్గటం ద్వారా ఎయిడ్స్ నియంత్రణం పరంగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానానికి
చేరగలిగింది. రాష్ట్రంలో గుర్తించబడిన 2 లక్షల 30 వేల మందికి చికిత్స అందిస్తున్నారు. గడచిన రెండేళ్లలో ఎయిడ్స్ పాజిటివ్ శాతం సున్నా పాయింట్0.8% నుంచి పాయింట్ 0.7% తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత అంతర్జాతీయ సంస్థల నిధులు సేకరణ లో తగ్గుదల వల్ల ,ఎయిడ్స్ నివారణకు కొంత ఇబ్బంది ఎదురవుతున్నట్టు ఐక్యరాజ్యసమితి అంచనావేసింది.ప్రపంచ వ్యాప్తంగా ఆరు లక్షల ముప్పై వేల మంది మరణించారు. అంటే రోజుకు సగటున 17 నుంచి 18 వందల మంది ఎయిడ్స్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2019 లెక్కలు ప్రకారం రోజుకు 31 నుంచి 32 మంది మరణిస్తున్నట్టు ఒక అనిర్దిష్ట అంచనా. ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఎయిడ్స్ నియంత్రణ పట్ల ప్రచారం విస్తృతంగా చేయడం వల్ల ప్రజల్లో అవగాహన కలిగి ఎయిడ్స్ వ్యాధి మహమ్మారి నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2030 నాటికి ఈ వ్యాధి కేసులు 15 వేలకు పరిమితమై,గణనీయంగా తగ్గుముఖం పడతాయని ఒక అంచనా. ఎయిడ్స్ మహమ్మారి ఈ భూమి మీద నుంచి అంతర్ధానం అయ్యే రోజు తొందరలోనే వస్తుందని ఆశిద్దాం.ఎయిడ్స్ నిరోధానికి మందు లేదు, ముందు జాగ్రత్తే రక్షణ.
ఎయిడ్స్ గురించి అనుమానం వస్తే,ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి ఉచిత పరీక్ష చేయించుకోండి.
వ్యాధిగ్రస్తులకు ఏఆర్టి సేవలు, మందులు ఉచితంగా పొందండి. అపోహలు విడిచి అవగాహన పెంచుకోండి. ఎయిడ్స్ వ్యాధి వచ్చిందని ఇంటికి పరిమితం కాకుండా, వెంటనే పరీక్షకు వెళ్లండి. మందులు వాడటం ద్వారా జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు. హెచ్ఐవి ఉన్నవారి పట్ల వివక్షత చూపరాదు. హెచ్ఐవి ఉన్నవారు సురక్షితమైన జీవన శైలి అలవర్చుకోవాలి. తల్లి నుంచి బిడ్డకు వచ్చే ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నివారించడం ఇప్పుడు సాధ్యమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో తగ్గుతున్న ఎయిడ్స్ ప్రభావం