Skip to main content

Telugu News Power

ప్లాస్టిక్ వాడకం ప్రమాదకరం

యలమంచిలి, నవంబర్,30 (తెలుగు న్యూస్ పపర్) ప్లాస్టిక్ వాడకం ఎంత ప్రమాదకరమైనదో వివరిస్తూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అడవిపాలెం ర్యాలీ నిర్వహించారు. పాలకొల్లు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ అటానమస్ కాలేజీ విద్యార్థులు ఏడు రోజుల ప్రత్యేక ఎన్ ఎస్ ఎస్ క్యాంప్ నిర్వహణలో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కార్యక్రమం జరిపారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు రైసా అధ్యక్షులు చెరుకూరి అంజిబాబు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఎం రామకృష్ణ డాక్టర్ వి విజయలక్ష్మి వీఆర్వో కే నరేష్ తదితరులు పాల్గొన్నారు.