Telugu News Power

నూతన చట్టాలు తెలుసుకోవాలి

న్యాయ సంహితపై మాట్లాడుతున్న ఎస్ఐ పృద్వి

పాలకొల్లు:డిసెంబరు,1(తెలుగు న్యూస్ పవర్) భారతీయ న్యాయ సంహిత చట్టాల గురించి తెలుసుకోవాలని పాలకొల్లు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జి పృద్వి పిలుపునిచ్చారు. అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, ప్రభుత్వ కళాశాల తెలుగు మరియు రాజనీతి శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో భారతీయ నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం సోమవారం స్థానిక కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎస్సై పృథ్వి మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నాటి పురాతన చట్టాల స్థానంలో భారత ప్రభుత్వం నేటి ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీసుకువచ్చిన చట్టాల గురించి అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. భారతీయ న్యాయ సంహిత గత ఏడాది అమలులోకి వచ్చిందన్నారు. ఏ దేశంలో ఉన్న, ఆ దేశం యొక్క చట్టాలు అందరూ తెలుసుకోవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ టి కృష్ణ, భద్రాచలం,భూసి వెంకటస్వామి, ఏఎస్ఐ మరులింగం, ఇతర అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు  పాల్గొన్నారు.