యలమంచిలి:డిసెంబరు,1 (తెలుగు న్యూస్ పవర్) ఈ ప్రపంచాన్ని మార్చగలిగే గొప్ప ఆయుధం చదువు ఒక్కటేనని ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పేర్కొన్నారు. యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉచిత టెస్ట్ పేపర్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా సోమవారం మట్లపాలెం ఉన్నత పాఠశాలలో గోపి మూర్తి పుస్తకాల పంపిణీ సందర్భంగా మాట్లాడారు. గోపి మూర్తి ఉన్నత విద్య ఈ ఉన్నత పాఠశాలలోనే సాగింది. విద్యార్థులు పుస్తకాలు తో పాటు తను ఉంటున్న సమాజ స్థితిగతులను కూడా అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పాఠశాల విద్యార్థులకు గోపి మూర్తి సౌజన్యంతో టెస్ట్ పేపర్లు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కోశాధికారి పోలిశెట్టి క్రాంతి కుమార్, మండల అధ్యక్షులు గుత్తుందీవి శ్రీనివాసరావు, అంతర్వేది పద్మనాభ కుమార్, ముద్దుల బాపిరాజు, ప్రధానోపాధ్యాయులు కడలి రాధికా రాణి , మంద ఉమా, ఎం వి వి సత్యనారాయణ, కట్టా కృష్ణ,, వలవల యజ్ఞ ప్రసాద్, డేగల వెంకటేశ్వరరావు సూర్యప్రభ, ఈడేపల్లి రాఘవులు, చల్లా నరేంద్ర కుమార్, ఆకుమర్తి నరేష్,,వర్ధనపు సందీప్ పలువురుఉపాధ్యాయులు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
