పాలకొల్లు: డిసెంబర్,1 (తెలుగు న్యూస్ పవర్) కార్తీక మాసం సందర్భంగా స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన నెల రోజుల నిత్యాన దాన కమిటీ సమావేశం లీలా కళ్యాణ మండపంలో సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అన్నదాన కార్యక్రమం కోసం నిరంతరం శ్రమించిన పలువురు స్వచ్ఛంద సేవకులను సత్కరించారు. ఈ సందర్భంగా అక్టోబర్, 22 నుంచి నవంబర్, 20 వరకు
నెల మొత్తం జరిగిన ఆదాయ, వ్యయాలను వెల్లడించారు. విరాళాల రూపంలో వచ్చిన మొత్తం రూ. 29 లక్షల 36 వేల367 లు. కాగా ఖర్చులు 30 లక్షల 36వేల 298 రూపాయలు. నిత్యాన్నదాన పథకం ఆదాయ వ్యయాల లెక్కల ప్రకారం రూ. 99 వేల 931లు లోటు తేలింది. ఈ సమావేశంలో ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, ధర్మకర్తల మండల సభ్యులు, విశేష సేవలు అందించిన భక్తులు పాల్గొన్నారు.




(ది. 22-10-2025 నుంచి 20-11-2025 వరకు)