Telugu News Power

ఉద్యోగార్థులకు శిక్షణ

శిక్షణ శిబిరం ప్రారంభ ఉపన్యాసం చేస్తున్న ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి

పాలకొల్లు: డిసెంబర్,4 (తెలుగు న్యూస్ పవర్)ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు ప్రస్తుతం ఇచ్చే శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి పేర్కొన్నారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి, ప్రభుత్వ అటానమస్ కళాశాల లో డిగ్రీ చివరి ఏడాది విద్యార్థుల కోసం ఈ శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభించారురు. విద్యార్థులకు కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వారం రోజులపాటు జరుగుతుంది. మహిళా సాధికార విభాగం, జవహర్ నాలెడ్జ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో నాంది ఫౌండేషన్ ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. విద్యార్థులు ఉద్యోగాలు పొందటానికి అవసరమైన ఆంగ్ల భాష పై పట్టు సాధించడం, ఇంటర్వ్యూ కోసం తయారు చేయడం వంటి నైపుణ్యాలు నేర్పిస్తారు. నంది నాంది ఫౌండేషన్ శిక్షకులు ఈశ్వర్ రోజువారి ఈ నైపుణ్యాలపై యాక్టివిటీ బేస్డ్ శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ టి .కృష్ణ ,తెలుగు శాఖ బూసి వెంకటస్వామి,ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్ బి డి శ్రీనివాస్, మహిళా సాధికార విభాగం కోఆర్డినేటర్ బి.కే.వి రామలక్ష్మి, జేకేసి మెంటర్ శిరీష విద్యార్థులు పాల్గొన్నారు.